ఉత్తర కొరియాపై భారత్‌ ఆంక్షలు మరింత కఠినతరం

- October 20, 2017 , by Maagulf
ఉత్తర కొరియాపై భారత్‌ ఆంక్షలు మరింత కఠినతరం

ఉత్తరకొరియాతో వాణిజ్య సంబంధాలపై విధించిన నిబంధనలను భారత్‌ మరింత కఠినతరం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీఎఫ్‌టీ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌) ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఉత్తరకొరియా నుంచి వచ్చే ప్రత్యక్ష దిగుమతులు/ఎగుమతులు, సరఫరా, అమ్మకాలు, రవాణా, కొన్ని ప్రత్యేక వస్తువులపై నిషేధం విధిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. నిషేధం విధించిన వాటిల్లో శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు, సహజ వాయువు లిక్విడ్స్‌, ముడిచమురు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎగుమతి/దిగుమతి అవుతున్న సీఫుడ్‌, ముడి ఇనుము, టెక్స్‌టైల్స్‌తో పాటు ఇతర వస్తువులపై కఠినమైన నిబంధనలు విధించింది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్‌, ఉత్తరకొరియా మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు క్షీణించాయి. ఇరుదేశాల మధ్య గతేడాది 198.78 మిలియన్‌ డాలర్ల వ్యాపారం జరగ్గా 2016-17లో 133.43 మిలియన్‌ డాలర్ల వ్యాపారం మాత్రమే జరిగింది. వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారిన ఉత్తరకొరియాను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆదేశంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉ.కొరియా నుంచి వచ్చే దిగుమతులు/ఎగుమతులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com