ఆస్ట్రియాలో సర్కారు ఏర్పాటుకు యువనేత సెబాస్టియన్ కర్జ్కు అధ్యక్షుడి ఆహ్వానం
- October 20, 2017
ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కుడైన ఛాన్సలర్‌గా ఎదిగిన ఆస్ట్రియా యువనేత సెబాస్టియన్ కర్జ్(31)ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా దేశాధ్యక్షుడు శుక్రవారం ఆహ్వానించారు. 'అద్భుత యువమేధావి'గా అందరూ ఆప్యాయంగా పిలుచుకునే కర్జ్ సారథ్యంలోని 'పీపుల్స్ పార్టీ' ఇటీవలి ఎన్నికల్లో 31.5 శాతం ఓట్లను కైవశం చేసుకుని అగ్రగామిగా నిలిచిన విషయం గమనార్హం.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్‌డెర్ బెలెన్ ఆహ్వానించిన నేపథ్యంలో ఇప్పుడిక సంకీర్ణం కోసం చర్చలను ప్రారంభిస్తానని యువనేత కర్జ్ శుక్రవారం నాడిక్కడ వెల్లడించారు. 'సరికొత్త రాజకీయ సంస్కృతి, నూతన రాజకీయ శైలి'ని తాను ఆకాంక్షిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఆస్ట్రియాలో అసలు సిసలైన మార్పును తీసుకురాగల సాహసం, సంకల్పబలం ఉన్న ప్రభుత్వం ఏర్పాటు తన కల అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







