పాక్ లో చైనా రాయబారిని చంపేందుకు కుట్ర

- October 22, 2017 , by Maagulf
పాక్ లో చైనా రాయబారిని చంపేందుకు కుట్ర

పాక్‌ ఆత్మబంధువుగా పేరున్న చైనా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పాకిస్థాన్‌లో నియమించిన చైనా రాయబారిని హతమార్చేందుకు ఓ ఉగ్రబృందం సిద్ధమైంది. చైనాలోని జిన్జియంగ్‌ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించే ఇస్లామిక్‌ ఉగ్రసంస్థకు కొందరు ముష్కరులు పాకిస్థాన్‌లో ప్రవేశించారు. వీరు తమ రాయబారి కోసమే పాక్‌లోకి వచ్చినట్లు చైనా అనుమానిస్తోంది. వెంటనే తమ రాయబారి, చైనా సిబ్బంది, చైనా-పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్లో పనిచేసే చైనీయులకు భద్రత కల్పించాలని పాక్‌కు లేఖ రాసింది. ఈ లేఖతోపాటు అబ్దుల్‌ వాలి అనే ఒక ఉగ్రవాది పాస్‌పోర్టు వివరాలను కూడా పాక్‌కు అందజేసింది. ఈ లేఖను పాకిస్థాన్‌ స్థానిక మీడియా సంస్థ ఒకటి ప్రచురించింది. ఇటీవలే పాకిస్థాన్‌లో చైనా కొత్త రాయబారిని నియమించింది. అప్పటి వరకు అక్కడ పనిచేసిన సన్‌ వైడాంగ్‌ను చైనాకు రప్పించి..ఆఫ్గనిస్థాన్‌లో రాయబారిగా పనిచేస్తున్న యో జింగ్‌ను పాకిస్థాన్‌లో నియమించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com