హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- April 24, 2026
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓయూ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అకస్మాత్తుగా పడిన వర్షంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.
నగరంలోని ఓయూ (OU), తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. వేడి గాలుల స్థానంలో చల్లటి గాలులు వీయడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.
అయితే, అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నెమ్మదించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఉపరితల ఆవర్తనం, వాతావరణ మార్పుల ప్రభావంతో రాబోయే గంటల్లో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో తాజ్ హోటల్, బాంబే బ్రాసరీ..!!
- బిగ్ టికెట్ లైవ్ డ్రా.. భారత ప్రవాసికి Dh25 మిలియన్ల జాక్‌పాట్..!!
- కువైట్ ఆరోగ్య వ్యవస్థ బలోపేతంలో నర్సుల పాత్ర కీలకం..!!
- దేశ భద్రతకు ముప్పు కలిగిస్తే గట్టిగా బదులిస్తాం..!!
- ఖతార్‌కు తొలి 10 నెలల్లో పోటెత్తిన పర్యాటకులు..!!
- ఒమన్‌లో ఎస్ఎంఈల అభివృద్ధికి మరో ముందడుగు..!!
- దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్‌లో దీపావళి వేడుకలు..
- దుబాయ్‌లో ప్రపంచంలోనే తొలి సిటీ వైడ్ టూరిజం లాయల్టీ ప్రోగ్రామ్ ప్రారంభం
- చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్..జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!







