ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా యువ సినిమా కళాకారులకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్

- October 22, 2017 , by Maagulf
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా యువ సినిమా కళాకారులకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా యువ సినిమా కళాకారులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశ్యంతో భాష, సాంస్కృతిక శాఖ, సినీవారం ఆధ్వర్యంలో లఘు చిత్రాల (షార్ట్‌ఫిల్మ్) పోటీ నిర్వహిస్తునట్లు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలి కాలంలో సృజనాత్మకమైన లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు రూపొందించే యువ దర్శకుల సంఖ్య పెరిగింది. 
కొత్త కథలు, సరికొత్త టెక్నిక్‌లతో లఘు చిత్రాలు రూపొందించే యువ దర్శకులకు ప్రోత్సహించేందుకు వారం వారం సినీవారం కార్యక్రమం నిర్వహిస్తున్న సాంస్కృతిక శాఖ తెలంగాణ పండుగలు, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించింది. సినిమా రంగంలోకి ప్రవేశించాలని తొలి అడుగులు వేస్తున్న యువతను ప్రొత్సహిస్తూ వారం వారం ప్రదర్శనలు, సినిమా టాక్ నిర్వహిస్తున్న సినీవారంలో మరో సినిమా పండుగ మొదలైంది. ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకోబోతున్న సందర్భంలో సాంస్కృతిక శాఖ యువ చిత్రోత్సవం 2017 నిర్వహిస్తోంది. 
లఘుచిత్రోత్సవంలో ఎంట్రీ ఉచితం. ఎంట్రీలను డిసెంబరు 1వ తేదీలోగా పంపాలి. ఫలితాలను డిసెంబరు 16న ప్రకటిస్తారు. డిసెంబరు 18న అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తారు. మొదటి బహుమతి: రూ. 50,000, రెండవ బహుమతి రూ. 40,000, మూడవ బహుమతి రూ. 30,000, కన్సొలేషన్ బహుమతులు 3, ఒక్కో బహుమతికి రూ. 25,000 నగదు అందజేస్తారు. ఎంట్రీలను [email protected] కు పం పాలి. అదనపు వివరాల కోసం www.tsdolc.com చూడండి. లేదా 9676726726/9849391432/040-23212832ను సంప్రదించండి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com