ప్రభాస్ నటిస్తున్న సాహో ఫస్ట్ లుక్ వచ్చేసింది
- October 22, 2017
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం సాహో ఫస్ట్ లుక్ వచ్చేసింది. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ తమ అధికారిక ట్విట్టర్ పేజీలో దీనిని రిలీజ్ చేశారు. విదేశీ వీధుల్లో పొగ మంచు మసకలో.. ముసుగు ధరించిన ప్రభాస్ నడిచి వస్తున్న పోస్టర్‌ను వదిలారు. చూస్తుంటే హాలీవుడ్ స్థాయిలోనే దర్శకుడు సుజిత్ దీనిని రూపొందిస్తున్నాడేమో అనిపిస్తుంది.
ఐదేళ్ల తర్వాత తమ అభిమాన హీరో స్టైలిష్ లుక్కులో కనిపించటంతో డార్లింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే... పోస్టర్ పై కామెంట్లు చేస్తున్నారు. సుమారు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ స్టైలిష్ ఎంటర్‌టైనర్‌లో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







