2 మిలియన్ దిర్హామ్‌ల విలువైన ఫేక్ అడిడాస్ ఐటమ్స్ పట్టివేత
- October 23, 2017
షార్జా ఎకనమిక్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, 10,000కి పైగా ఫేక్ షూస్‌ని సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ 2,004,780 దిర్హామ్స్ ఉంటుందని అంచనా. ఎస్ఇడిడి - కమర్షియల్ కంట్రోల్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సలీమ్ అల్ సువైది మాట్లాడుతూ, 100,539 ఫేక్ ప్రోడక్ట్స్‌ని వివిధ షాపుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్ఇడిడి కమర్షియల్ ఫ్రాడ్ డివిజన్ హెడ్ ముహన్నాద్ రజబ్ మాట్లాడుతూ, ఏడాది పొడవునా తనిఖీలు జరుగుతుంటాయనీ, అక్రమార్కుల్ని వదిలిపెట్టేది లేదని చెప్పారు. నిబంధనల్ని ఉల్లంఘించేవారికి సంబంధించిన సమాచారాన్ని 80080000కి తెలియజేయాలని ఆయన సూచించారు. అడిదాస్ సంస్థ, యూఏఈ చేపట్టిన ఈ చర్యల పట్ల హర్షం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







