200,000 దిర్హామ్లకే ఫెరారీ కారు
- October 23, 2017
దుబాయ్లో నలుగురు సభ్యుల దొంగల ముఠా 1.2 మిలియన్ దిర్హామ్ల విలువైన ఫెరారీ కారుని 200,000 దిర్హామ్లకే విక్రయించిన ఘటన వెలుగు చూసింది. అయితే ఆ కారుని డిస్మాండిల్ చేసి, కార్గో చేయాలనే ప్రయత్నంలో దొంగల ముఠా ఉండగానే పోలీసులు పట్టుకోవడం జరిగింది. యూరోప్కి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు తన కారు దొంగలింపబడినట్లు ఫిర్యాదు చేశారు. ఆ కారుని ఆఫ్రికాకి చెందిన ఓ వ్యక్తికి 55,000 దిర్హామ్లకే విక్రయించినట్లు దుబాయ్ పోలీస్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సూరి చెప్పారు. ఆఫ్రికన్ నిందితుడు, ఆ కారుని గ్యారేజ్కి తీసుకెళ్ళి, అక్కడినుంచి విదేశాలకు తరలించి, స్పేర్ పార్టులుగా ఆ కారుని అమ్మేందుకు యత్నించాడు. నిందితుడు యూఏఈకి విజిట్ వీసాపై వచ్చినట్లు తెలిపారు. కారు మాజీ ఓనర్, ఆ కారు వివరాలు నిందితులకు చెప్పడంతో, వ్యూహాత్మకంగా కారుని దొంగిలించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. కారు అలాగే కారు ఓనర్ని ఈ ముఠా అనుసరిస్తూ, సమయం చూసి దాన్ని దొంగిలించారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







