సెక్యూరిటీ గార్డుపై దాడి: 8 మంది అనుమానితుల విచారణ
- October 23, 2017
మనామా: క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోని ఎమ్యూజ్‌మెంట్ పార్క్ వద్ద అరబ్ సెక్యూరిటీ గార్డుపై జరిగిన అతి కిరాతకమైన దాడికి సంబంధించి ఏడుగురు అనుమానితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారించింది. క్యాపిటల్ గవర్నరేట్ ప్రాసిక్యూషన్ హెడ్ మొహమ్మద్ అల్ మలికి, ఈ విషయాన్ని ధృవీకరించారు. నిందితుల్ని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడంతోపాటుగా, మిగిలిన నిందితుల్ని పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బాధితుడు గాయాల నుంచి కోలుకున్న తర్వాత, ఆయన్నుంచి మరింత సమాచారం సేకరించనున్నారు. దానికి తోడుగా సర్వైలెన్స్ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్‌ని కూడా పరిశీలిస్తారు. ఈ ఘటనలో గాయపడ్డ గార్డుని సలమానియా మెడికల్ కాంప్లెక్స్‌కి తరలించారు. గార్డ్‌కి పలు చోట్ల ఫ్రాక్చర్స్ అయినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడయ్యింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







