బీట్‌రూట్ మంచూరియా
- October 23, 2017
కావలసిన పదార్థాలు: బీట్‌రూట్ పావు కేజీ, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, ఉప్పు తగినంత, గరంమసాలా 1 టీ స్పూన్ , పచ్చి మిరపకాయలు నాలుగు, ఉల్లిపాయలు అర కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి మిశ్రమం 1 టీ స్పూన్, కొత్తిమీర ఒక కట్ట, సోయాసాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1/2 టేబుల్ స్పూన్, టమోటా సాస్ 1 టేబుల్ స్పూన్, సాజీర 1/2 టీ స్పూన్, నూనె తగినంత.
తయారుచేయు విధానం: ముందుగా బీట్‌రూట్‌ను సన్నగా తురుముకోవాలి. పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడుక్కుని కట్ చేసుకోవాలి. తర్వాత కార్న్‌ఫ్లోర్, ఉప్పు, గరంమసాలా, పచ్చి మిర్చి ముక్కలను సన్నగా తురుముకున్న బీట్‌రూట్‌కు కలిపి ఉండలుగా చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో నూనె తీసుకుని కాస్త వేడి అయ్యాక సాజీర, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి మిశ్రమం, మిరియాలు, ఉప్పు, సోయాసాస్, చిల్లీ సాస్, టమోటా సాస్ వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీట్‌రూట్ ఉండలను ఇందులో వేసుకోవాలి. పైన కొంచెం గరం మసాలా చల్లుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే బీట్‌రూట్ మంచూరియా రెడీ.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







