ఈ నెల 27న రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ'
- October 23, 2017
ఎనర్జిటిక్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి డైరెక్టర్. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.
స్రవంతి రవికిషోర్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా లో రామ్ కి జోడీగీ క్యూటీ బ్యూటీస్ అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. లవ్, ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ఫ్లాపుల్లో ఉన్న రామ్ కి నేను శైలజ మూవీతో హిట్ ఇచ్చాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఈ మూవీతో డైరెక్టర్ కిషోర్ తిరుమలకి మంచి గుర్తింపు వచ్చింది. కిషోర్ మీద నమ్మకంతోనే రామ్ రెండో సినిమా ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఈ కాంబినేషన్లో వస్తుండటంతో ఉన్నది ఒక్కటే జిందగీపై ప్రేక్షకుల్లో ఏర్పడింది.
రామ్ ని ఈ మూవీలో డిఫరెంట్ లుక్ లో, స్టైలిష్ గా ప్రజెంట్ చేస్తున్నాడు డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆడియో ఫంక్షన్లో విడుదల చేసిన ధియేట్రికల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. రామ్ తో పాటు హీరోయిన్లు అనుపమ, లావణ్య కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటోంది టీమ్. సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ఈ నెల 27న విడుదలవుతోంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







