బ్రిటన్‌లోని రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు గాల్లో తేలుతూ... నోటి దగ్గరకే ఆహారం
- October 23, 2017
రెస్టారెంట్లలో ఆహార పదార్థాలు గాల్లో తేలుకుంటూ నేరుగా మన నోటి దగ్గరకు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి బాటలు పరిచే పరిజ్ఞానాన్ని బ్రిటన్‌లోని ససెక్స్ వర్సిటీ నిపుణులు అభివృద్ధి చేశారు. అత్యధిక పౌనఃపున్య శబ్ద తరంగాల సాయంతో ఆహార పదార్థాలను గాల్లోకి లేపడంపై వారు దృష్టిసారించారు. ఒకే పౌనఃపున్యంతో రెండు భిన్న తరంగాలను ఎదురెదురుగా పంపితే జనించే స్థిర తరంగాలతో ఆహారాన్ని తరలించొచ్చని నిరూపించారు. 'స్థిర తరంగాలతో... ఆహారం బరువు తగ్గడంతోపాటు గాల్లో స్థిరంగా ఉంటుంది. దీంతో కన్వేయర్ బెల్ట్‌పై పంపినట్టే పదార్థాలను గాల్లో పంపించొచ్చు'అని పరిశోధకులు షీ తన్నావీ తెలిపారు. అంతేకాదు ఆహారం గాల్లో తేలుకుంటూ వస్తే.. దానిలోని తీపిదనం కూడా పెరుగుతుందని వివరించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







