'అభిమాన్' రీమేక్ లో నటించబోతున్న అభిషేక్,ఐశ్వర్య
- October 25, 2017
అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్ ఇద్దరూ కలిసి సినిమా చెయ్యబోతున్నారు. ఐశ్వర్య బచ్చన్ ఫ్యామిలీలో కోడలిగా అడుగుపెట్టాక జూ.బచ్చన్-ఐశ్వర్య ఇద్దరూ కలిసి సినిమా చేస్తే బావుంటుందని బిగ్ బి ఫ్యాన్స్ తో పాటు చాలా మంది సినీజనాలు అనుకున్నారు.కొంతమంది నిర్మాతలు ఈ క్రేజీ కాంబోతో సినిమా నిర్మించడానికి అడ్వాన్సులు కూడా రెడీ చేసుకున్నారు.అయితే వీళ్లిద్దరు కలిసి సినిమా చెయ్యలేదు. అయితే ఇప్పుడు ఈ బచ్చన్ కపుల్ కలిసి ఓ సినిమా చెయ్యబోతున్నారు.
అమితాబ్ బచ్చన్-జయా బచ్చన్ కాంబినేషన్లో వచ్చిన క్లాసికల్ హిట్ అభిమాన్ సినిమా రీమేక్ లో అభిషేక్-ఐశ్వర్య కలిసి నటించబోతున్నారట. భర్త కంటే భార్యకు ఎక్కువగా పాపులారిటీ వస్తోంటే, అతను ఆ సిచ్యువేషన్స్ ను ఎలా రిసీవ్ చేసుకుంటాడు? భార్యకు సపోర్ట్ గా నిలుస్తాడా? అనే పాయింట్ తో వచ్చిన ఈసినిమాలోనే అభి-ఐష్ కలిసి నటించబోతున్నారట. ఇక అమితాబ్-జయలు ఈసినిమా టైంలోనే పెళ్లిచేసుకున్నారు. బిగ్ బి కి వెరీ స్పెషల్ గా నిలిచిన ఈసినిమాలోనే జూ.బచ్చన్ కపుల్ కలిసి నటిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అభిషేక్-ఐశ్వర్య కలిసి నటించిన సినిమాలు ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. మరి ఈ అభిమాన్ రీమేక్ ఆ ట్రాక్ రికార్డ్ ను చెరిపేస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









