త్రివిక్రమ్ సినిమా పూర్తి కాకుండానే.. పవర్ స్టార్ కోసం 3 సినిమాలు వెయిటింగ్..
- October 25, 2017
పవన్ కళ్యాణ్ ట్రెండ్ మార్చేస్తున్నాడు. హిస్టరీని చెరిపేస్తూ అభిమానులు పండుగ చేసుకునేలా కొత్త ఫార్ములాస్ ను క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు వన్ బై వన్ అనే ఫార్మాట్ లో వెళ్తోన్న పవర్ స్టార్ ఇప్పుడు స్పీడ్ ట్రాక్ ఎక్కుతున్నాడు. ఆల్రెడీ త్రివిక్రమ్ తో కలిసి సంక్రాంతిని టార్గెట్ చేసిన పవర్ స్టార్, మరో మూడు సినిమాలతో పవన్ సేను కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు.
పవన్ కళ్యాణ్ ఫుల్ స్పీడ్ గా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న పవన్, ఈసినిమా రిలీజ్ కంటే ముందే మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పి.ఎస్.పి.కె.25 సంక్రాంతికి జనవరి10న రిలీజ్ అవుతోంది. 100కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈసినిమా ఇప్పటికే భారీ బిజినెస్ చేసింది. ట్రేడ్ మార్కెట్ లోనూ ఈసినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని హైప్స్ పెంచింది.
ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తన 25వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కంప్లీట్ కాకముందే పవన్ కోసం మూడు సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్-నీసన్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యడానికి కమిట్ అయ్యాడు. ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తోన్న ఈసినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అలాగే మైత్రీ మూవీస్ బ్యానర్ లో సంతోష్ శివన్ తో పవన్ ఓ సినిమాకు సైన్ చేశాడు.
ఈ రెండు ప్రాజెక్టులు ఇంకా షూటింగ్ కు వెళ్లకముందే పవన్ కళ్యాణ్ కోసం క్రిష్ ఓ స్టోరీ రెడీ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ కృష్ణమ్ వందే జగద్గురుమ్ టైమ్ లోనే పవన్ తో సినిమా చెయ్యాలనుకున్న క్రిష్ కొన్ని కారణాలతో పవర్ స్టార్ ను డైరెక్ట్ చెయ్యలేకపోయాడు. అయితే ఇప్పుడు పవన్ తో సినిమా చెయ్యాల్సిందే అని ఓ స్టోరీ రెడీ చేసుకున్నాడట. ఝాన్సీ లక్ష్మి భాయ్ జీవితగాథ మణికర్ణిక కంప్లీట్ కాగానే పవన్ ను కలుస్తాడట క్రిష్. సో ఈలిస్ట్ చూస్తోంటే ఏడాది, రెండేళ్లకు ఓ సినిమా చేసే పవన్ వరుస సినిమాలతో అభిమానులకు పండుగ ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







