బహ్రెయిన్ నడి రోడ్డులో కారుని నిలిపి భార్య మొహంపై పిడి గుద్దులతో భర్త దాడి
- October 30, 2017
మనామా : గల్ఫ్ దేశాలలోనూ గృహ హింస గణనీయంగా పెరుగుతోంది. బహ్రెయిన్ భార్యతో కారులో ప్రయాణిస్తున్న ఒక భర్త నడిరోడ్డులో కారును నిలిపి ఆగ్రహంతో ఆమె మొఖం మీద పలుమార్లు చేతిథితో పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఆ మహిళకు చెందిన న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటనలో బాధితురాలిని రాజ్యంలోని ప్రధాన రోడ్డుల్లో ఒకటైన మార్గంలో భార్యతో కల్సి కారులో ప్రయాణిస్తున్నాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మునుపటి విబేధాలను మనస్సులో ఉంచుకొని ఆ భర్త , స్వల్ప కారణానికే వాహనం రోడ్డు మధ్యలో ఆపి ఆ మహిళ మొహంపై రెండుసార్లు బలంగా చేతితో మోదాడు. దాంతో ఆమె అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. నిందితుడు జరిపిన పాశవిక దాడిలో ఆ మహిళకు చావు తప్పి కన్నులొట్టబోయి నల్లగా మారింది. అపస్మారక స్థితిలో ఉన్న తన భార్యను నిర్దాక్షిణ్యంగా వదిలి నిందితుడు అక్కడనుంచి పారిపోయాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ సంఘటన గురించి తెల్సుకోవడంతో ఆ రాక్షస భర్తని అరెస్టు చేశారని న్యాయవాది వివరించాడు. ఇది మూడవ కేసు అని గత రెండు నెలల్లోనే బహ్రెయిన్ లో భార్యలను దారుణంగా హింసించే భర్తలు నానాటికి పెరుగుతున్నారని గృహ హింస సమస్య క్రమేపీ దేశంలో పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు, ఇంకా వెలుగులోనికి రాని గృహహింస కేసులు ఎన్నో ఉన్నాయని...స్రీలు పడుతున్న కష్టాలు..వేదన గురించి ఇంకా వెలుపలికి మాట్లాడని.. వెలుగులోనికి రాని బాధితుల సమస్యలు ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







