కొబ్బరిపాలు క్యాన్సర్ లను నివారించును
- November 07, 2015
కొబ్బరి పాల గురించి విన్నారా ? అప్పుడప్పుడు కొబ్బరి పాలను ఆహారంలో చేర్చుకుంటున్నారా ? కొబ్బరి పాలల్లో ఆవుపాల కన్నా ఆరోగ్యమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి.. ఇకపై కొబ్బరిపాలను మీ డైట్ లో చేర్చుకోండి. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి. కేశాలకు కొబ్బరి పాలు అందించే అద్భుత ప్రయోజనాలు అయితే కొబ్బరి పాలు అనగానే కొబ్బరి నీళ్లు గుర్తొస్తాయి. కానీ కొబ్బరి నీళ్లు కూడా ఆరోగ్యానికి మంచిదే.. అదే తరహాలో కొబ్బరి పాలల్లో కూడా చాలా ప్రయోజనాలు దాగున్నావి. వీటిని పచ్చి కొబ్బరి ద్వారా తీస్తారు. పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి.. కాస్త నీళ్లు కలిపి పేస్ట్ లా మిక్సీ పట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని పిండితే వచ్చేవే కొబ్బరి పాలు. వీటిని కూరల్లోనూ, సూప్ లలోనూ వాడుకుంటే రుచికరంగా ఉంటుంది. మరి ఈ కొబ్బరిపాలల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో చూద్దాం.. కొబ్బరి పాలు ఆవుపాల కన్నా ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఆవు పాలతో పోలిస్తే ఇవి సులభంగా జీర్ణమవుతాయి. కొబ్బరిపాలల్లో ఒమేగా త్రీ ఆమ్లాలు, ఒమేగా అమైనా యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటి కలయికతో.. కొబ్బరి పాలు సంపూర్ణ ఆరోగ్యం అందుతుంది. కొబ్బరి పాలల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి బాగా సహకరిస్తుంది. ఎలాంటి ఆహారమైనా.. త్వరగా జీర్ణమవడానికి ఇవి తోడ్పడతాయి. కొంత మంది పాల ఉత్పత్తులంటే ఇష్టపడరు. కనీసం పెరుగు కూడా తినలేకపోతారు. అలాంటి వాళ్లు కొబ్బరిపాలు తీసుకోవడం మంచిది. కొబ్బరిపాలలో భాస్వరం, క్యాల్షియం వంటి పోషక పదార్థాలు ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకల సమస్యలుంటే.. కొబ్బరి పాల వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఎముకలలో నొప్పి, వాపు తగ్గించడానికి సహకరిస్తాయి. కొబ్బరి పాలు కీళ్ల నొప్పులు తగ్గించడానికి మంచి ఔషధంలా పనిచేస్తాయి. తీవ్ర ఒత్తిడి, ఆందోళనతో బాధపడే వాళ్లకు కొబ్బరిపాలు చక్కటి పరిష్కారం. వీటిలో ఉండే పొటాషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. కొబ్బరిపాలు పోషకాల మెండు. ఇందులో ఉండే పోషకాల శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. రోజుకో కప్పు కొబ్బరిపాలు తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కొబ్బరి పాలలో ఉండే ఖనిజాలు క్యాన్సర్ ని అరికడతాయి. ప్రేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లను నివారించడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ సెల్స్ అభివృద్దిని నిరోధించగల యాంటియాక్సిడెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి తరచుగా కొబ్బరిపాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







