పోలీసుశాఖపై దృష్టి సారించిన కేసీఆర్
- November 07, 2015
నిరుద్యోగుల ఎదురుచూపులకు క్రమంగా తెరపడుతోంది. ట్రాన్స్‌కో, జెన్కో, టౌన్‌ప్లానింగ్ వంటి విభాగాల్లో నియామాకాలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా పోలీసుశాఖపై దృష్టి సారించింది. పోలీసు ఉద్యోగ నియామకాల దస్త్రంపై సీఎం కేసీఆర్ నేడు సంతకం చేశారు. 9 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. నియామకాల్లో 33 శాతం మహిళలు ఉండాలని నిర్ణయం. సివిల్ పోలీస్ నియామకాల్లో ఆర్మ్డ్ రిజర్వుడ్ పోలీసుల నియామకాల్లో మహిళలకు 10 శాతం కోటా కేటాయింపు. భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. - సివిల్ ఎస్ఐ పోస్టులు 107 - అగ్నిమాపక శాఖలో 510 - ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ 186 - సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 1,880 - ఆర్మ్డ్ కానిస్టేబుల్స్ 2,800 పోస్టులు - ప్రత్యేక పోలీసులు 3,200 - ఆర్మ్డ్ ఎస్ఐలు 91 - ప్రత్యేక పోలీసు ఎస్ఐ పోస్టులు 288 - 35 కమ్యూనికేషన్ ఎస్ఐలతో పాటు పలు పోస్టుల నియామకానికి అంగీకారం తెలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా రాతపరీక్షలో తెలంగాణ చరిత్రను తప్పనిసరి చేసిన ప్రభుత్వం పురుషులకు 5 కి.మీ., మహిళలకు 2.5 కి.మీ. పరుగు పోటీ రద్దుచేసింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







