సమ్మర్ లో సూపర్ స్టార్స్ మరియు మెగా ఫ్యామిలి మధ్య ఫైట్

- November 02, 2017 , by Maagulf
సమ్మర్ లో సూపర్ స్టార్స్ మరియు మెగా ఫ్యామిలి మధ్య ఫైట్

టాలీవుడ్లో ఒక పక్క సంక్రాంతి సీజన్లో తమ సినిమాలను రిలీజ్ చేయడానికి పోటీ పడుతుంటే..మరి కొంత మంది హీరోలు సమ్మర్ సీజన్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే సంక్రాంతి సినిమాలపై ఓ క్లారిటీ వచ్చింది కానీ, సమ్మర్ సీజన్లో రాబోయే సినిమాలు మాత్రం కన్ ఫ్యూజ్ చేస్తున్నాయి. దాదాపుగా పెద్ద హీరోలందరూ ఏప్రిల్ నే టార్గెట్ చేశారు. అదే ఇప్పుడు వారికి పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల ఆల్ రెడీ ఫిక్స్ చేసుకున్న డేట్స్ ని మార్చుకోవాల్సివస్తోంది. ఈ లిస్ట్ లో ఉన్న రామ్ చరణ్, ముందుగానే తన సినిమాని ప్రీ పోన్ చేసుకుంటున్నాడు.

టాలీవుడ్లో వచ్చే సమ్మర్లో పెద్ద ఫైట్ జరగబోతుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబుల సినిమాలు వేసవిలోనే రాబోతున్నాయి. వీటికి తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వస్తుండటంతో పోటీ మరింత హాట్ గా మారుతోంది. అయితే వీరంతా ఏప్రిల్ నెలలోనే తమ సినిమాలు రిలీజ్ చేయడానికి డేట్స్ ఫిక్స్ చేసుకోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి.
సమ్మర్లో సందడి చేయడానికి వస్తున్న సినిమాల్లో రంగస్థలం 1985 ఒకటి. రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం.. ఇప్పటికే చాలాభాగం షూటింగ్ చేసుకోగా.. ప్రస్తుతం హైద్రాబాద్ లోనే ఓ కొండపై రంగస్థలం ఊరి సెట్ వేసి షూటింగ్ ను కంటిన్యూ చేస్తున్నారు. మొదట సంక్రాంతికి రిలీజ్ అనుకున్న మూవీ.. ఆ తర్వాత సమ్మర్ కి పోస్ట్ పోన్ అయింది. ఏప్రిల్ 13న రామ్ చరణ్ రంగస్థలం రిలీజ్ అవుతుందనే టాక్ వినిపించింది. అయితే ఏప్రిల్ 27న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన కొత్త సినిమా నా పేరు సూర్య చిత్రాన్ని రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేశాడు. కానీ సడన్ గా ఇదే డేట్ కు మహేష్ నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం కూడా రేసులో నిలిచింది. కొరటాల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే సమస్య అనుకుంటే.. ఇప్పుడు రజినీకాంత్ రూపంలో మరో ప్రమాదం తరుముకొచ్చేసింది. జనవరి చివరలో విడుదల కావాల్సిన రోబో సీక్వెల్ 2.ఓ మూవీని.. తమిళ్ న్యూ ఇయర్ అంటూ తెచ్చి ఏప్రిల్ 13న వేశారు. దీంతో చరణ్ తో పాటు మహేష్, బన్నీల మీద కూడా ఈ సినిమా ప్రభావం పడుతోంది.
ఈ ప్రకారం ఏప్రిల్ 13న చరణ్, రజనీకాంత్ సినిమాలు, ఏప్రిల్ 27న మహేష్, బన్నీల సినిమాలు విడుదలకాబోతున్నాయి. కానీ ఇలా వస్తే..ధియేటర్ల సమస్య ఉంటుంది. అందుకే డేట్స్ మార్చుకోబోతున్నారు మన హీరోలు ముందుగా.. రామ్ చరణ్ తన రంగస్థలం మూవీని మార్చ్ 29కే విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. అంటే సమ్మర్ సీజన్ ను స్టార్ట్ చేయబోయేది చెర్రీనే.. రజనీకాంత్ రోబో సీక్వెల్ ఏప్రిల్ 13నే వస్తుంది. ఇక ఏప్రిల్ 27న వస్తున్న మహేష్, అల్లు అర్జున్ లలో ఎవరో ఒకరు మే నెలకి షిఫ్ట్ అయితే బెటర్. మరి ఆ డెసిషన్ ఎవరు తీసుకుంటారో చూడాలి.. ఏది ఏమైనా వచ్చే సమ్మర్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో హీటెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com