గలౌటీ కబాబ్‌

- November 02, 2017 , by Maagulf
గలౌటీ కబాబ్‌

కావాల్సిన పదార్థాలు
మటన్‌ ఖీమా 800 గ్రాములు, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ 20 గ్రాములు, జీడిపప్పు పేస్ట్‌ 30, గ్రాములు, ఖుస్‌ ఖుస్‌ పేస్ట్‌ 10 గ్రాములు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్‌ స్పూన్‌, కారం 2 టేబుల్‌ స్పూన్‌, లవంగాలు 6, పచ్చిమిరపకాయలు 10 గ్రాములు, ఉల్లిపాయలు 50 గ్రాములు, పుదీనా 10 గ్రాములు, కొత్తిమీర 20 గ్రాములు, నెయ్యి 50 గ్రాములు, నూనె 50 మిల్లీ లీటర్లు, రోజ్‌ వాటర్‌ 20 మిల్లీ లీటర్లు, కెవ్రా వాటర్‌ 20 మిల్లీ లీటర్లు, గులాబీ రేకుల పొడి 10 గ్రాములు, బ్రౌన్‌ ఆనియన్‌ పేస్ట్‌ 30 గ్రాములు, గ్రీన్‌ చిల్లీ పేస్ట్‌ 10 గ్రాములు.
 
తయారీ విధానం
గిన్నెలో మటన్‌ ఖీమా తీసుకుని దానికి అల్లం-వెల్లుల్లి పేస్ట్‌, జీడిపప్పు పేస్ట్‌, ఖుస్‌ఖుస్‌ పేస్ట్‌, ఉప్పు, గరం మసాలా, కారం, ఆనియన్‌ పేస్ట్‌, గ్రీన్‌ చిల్లీ పేస్ట్‌, రోజ్‌ వాటర్‌, కెవ్రా వాటర్‌, గులాబీ రేకుల పొడి బాగా కలిపి, అరగంట నానబెట్టాలి. తరువాత మాంసాన్ని గిన్నెలో ఉంచాలి. బాగా వేడిగా ఉన్న 3-4 పీస్‌ల బొగ్గు కణికలను కటోరీలోకి తీసుకోవాలి. దాంతో పాటుగా ఓ గిన్నెలో మిక్స్‌ చేసిన ఖీమా కూడా తీసుకోవాలి. దీనిపై లవంగాలు ఉంచి, నెయ్యి వేసిన వెంటనే ఆ గిన్నెను మూతతో 3-5 నిమిషాలు మూసేయాలి. ఈ మిక్స్‌కు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, నెయ్యి, జోడించాలి. సమాన భాగాలుగా విడగొట్టి బాల్స్‌లా చేసుకోవాలి. ఆ తరువాత కొద్దిగా నూనె చేతికి రాసుకుని టిక్కీలా చేయాలి. తరువాత ఓ తవాలో కొద్దిగా నెయ్యి వేసి, సన్నటి సెగపై టిక్కీలను బాగా వేయించాలి. వేడి వేడిగా సలాడ్‌/చట్నీతో సర్వ్‌ చేసుకుంటే రుచిగా ఉంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com