తాగుడు అలవాటున్న వారిని మాన్పించాలంటే..?

- November 03, 2017 , by Maagulf
తాగుడు అలవాటున్న వారిని మాన్పించాలంటే..?

మానవ శరీరంలోని విషాలను బయటకు పంపించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు బాగా ఉపయోగపడతాయి. బిపి, షుగర్, అధిక బరువు లాంటి ఆరోగ్య సమస్యలే కాకుండా తాగుడుకు బానిసలైన వారి ఆరోగ్యాన్ని కాపాడి వారిని ఆ అలవాట్ల నుంచి దూరం చేయడంలోను మెంతులు బాగా ఉపయోగపడతాయి. మద్యాన్ని ఎక్కువగా సేవించడం వల్ల కాలేయం పూర్తిస్థాయిలో చెడిపోతుంది.
 
ఆల్కహాల్ కారణంగా రక్తనాళాలు దెబ్బతింటాయి. శ్వాస వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయదు. దీనికితోడు కడుపులో మంట, పేగుల్లో మంట వస్తుంది. దీనికి కిడ్నీ, మూత్ర పిండాల సమస్య కూడా తోడవుతుంది. తాగుడుకు బానిసలైన వారిని మెంతులతో ఈజీగా రక్షించుకోవచ్చు. తాగుడు అలవాటున్న వారికి రెండు స్పూన్ల మెంతిగింజలను సుమారు నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టి ఆ తరువాత ఉడకబెట్టి కొద్దిగా తేనె కలిపి తినిపించాలి.
 
ఇలా చేస్తే దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుకోవచ్చు. దానికితోడు మిశ్రమాన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే మెంతుల్లోని చేదు, జిగురు తత్వాలు మద్యం అంటేనే ఒకరకరమైన అసహ్యాన్ని కలిగించేలా చేస్తాయి. ఎంత మద్యపానప్రియులైనా ఈ మెంతులను తిన్నాక మద్యం జోలికి అస్సలు వెళ్ళరు. మద్యంపైన ఆలోచన వెళ్ళినప్పుడు మెంతులతో చేసిన డికాక్షన్ తాగించాలి. ఇలా మెంతులు, మెంతు ఆకులను కలిపి తాగిస్తే తాగుడు అలవాటు నుంచి దూరం చేస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com