దహీ సెవెన్ లీఫ్స్ వడలు
- November 03, 2017
కావలసిన పదార్థాల : తోటకూర - ఒక కట్ట, పాలకూర - ఒక కట్ట, చుక్కకూర - ఒక కట్ట, పుదీనా - ఒక కట్ట, కొత్తిమీర - ఒక కట్ట, కరివేపాకు - రెండు రెబ్బలు, గోంగూర - ఒక కట్ట, మినపపప్పు - అరకిలో, పచ్చిమిరపకాయలు - ఎనిమిది, చిక్కని పెరుగు - ఒక లీటరు, శెనగపప్పు - ఒక చెంచా, మినపపప్పు - అర చెంచా, జీలకర్ర - ఒక చెంచా, ఆవాలు -చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, ఉప్పు - తగినంత, ఎండుమిరపకాయలు - ఆరు, నూనె - తగినంత.
తయారీ విధానం: నానబెట్టి రుబ్బిన మినపపప్పులో ఉప్పు, పర్చిమిర్చి, ఆకు కూరల తురుము వేసి బాగా కలపాలి. దీన్ని వడలుగా వేసి బాగా వేయించుకోవాలి. తరువాత మరో స్టౌ మీద గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి కాగాక సెనగపప్పు, మినపపప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగాక పెరుగులో కలపాలి. ఇప్పుడు వేయించిన వడల్ని ఈ పెరుగులో వేయాలి. అంతే దహీ సెవెన్ లీవ్స్ వడలు రెడీ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







