మనిషి తల, పిల్లి శరీరం ..

- November 05, 2017 , by Maagulf
మనిషి తల, పిల్లి శరీరం ..

మనిషి తన మేథస్సుకు పదును పెట్టి.. ఎన్నో పరిశోధనలు చేసి.. ఎన్నో కొత్తవాటిని ఆవిష్కరిస్తున్నాడు. కొత్త రోగాలు, కొత్త మందులు, కొత్త విషయాలు, కొత్త జీవులు ఇలా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి ఈ పరిశోధనలతో.. పరిశోధనల్లో ఒకటి జనెటిక్ మ్యూటేషన్.. ఇలాంటి పరిశోధనలు విఫలమైతే విపరీత సంఘటనలు చోటు చేసుకొంటాయి. అటువంటి విఫలమైన పరిశోధన ఫలితమే మనిషి తల కలిగిన పిల్లి. మానవులు ఎప్పటికీ ప్రకృతి పై పైచేయి సాధించలేరు అని చెప్పడానికి మరో ఉదాహరణ. పిల్లి మనిషి కలిగిన హైబ్రీడ్ ఆకృతి కలిగిన ఒక వింత జంతువు.. ఇది చేసే వికృతి చేష్టలు కలిగిన ఓ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేసింది. ఈ వీడియో క్లిప్ మలేషియాలో ఓ మారు మూల ప్రాంతంలో తీసినట్లు నివేదికలు చెప్పాయి. 
ఈ వీడియో లో గులాబీ రంగు దేహం, బట్టతల, రెండు చేతులు, కళ్ళు కలిగి ఉంది.. తల మాత్రం మనిషిని పోలి ఉంది.. ఈ వింత జీవి రెండు కాళ్ళకు, చేతులకు పదునైన గోర్లు, కోరల్లాంటి రెండు పదునైన పళ్ళు ఉన్నట్లు వీడియో చూసిన వారు గుర్తించారు. అంతేకాదు.. నెత్తిమీద అక్కడక్కడా కప్పి ఉంచినట్లు ఉన్న పలచనైన జుట్టు ఉన్న వింత ఆకారం చూసిన వారు హడలి పోయారు..అంతేకాదు.. ఈ వీడియో చూసిన వారు ఆ వింత ఆకారం మరిన్ని పుడతాయని కూడా భావించారు.. కాగా ఆ వింత ఆకారం.. జెనెటిక్స్ సృష్టి కాదని... కేవలం సిలికాన్ తో చేసిన బొమ్మని.. దీనిని అమ్మకం కోసం వీడియో గా రూపొందించి ఆన్ లైన్ లో ఉంచినట్లు తయారీదారులు చెప్పారు.. ఆ వింత జంతువు.. కాదు.. బొమ్మ అని తెలిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటువంటి వాటిని చూసి నిజాలు అని నమ్మవద్దు.. ఆందోళన చెందవద్దు.. అని మానసిక నిపుణులు నెటిజన్లు సలహా ఇచ్చారు.. అంతేకాదు.. ఇలాంటి ఎన్నో అబద్ధపు వార్తలు ప్రచారం అవుతాయి.. అవన్నీ నిజాలు అవ్వాల్సిన అవసరం లేదు.. కనుక ఏదైనా వింత సంఘటన అంటే.. ముందు ఆ వార్తపై పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకొని నమ్మండి అని చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com