కారు ప్రమాదం: అగ్నికి ఆహుతైన వ్యక్తి
- November 06, 2017
20 ఏళ్ళ అరబ్ వ్యక్తి ఒకరు, కారు ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యారు. కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. షార్జాలోని మ్లీహా రోడ్డులో సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ అవేర్‌నెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మేజర్ అబ్దుల్ రహ్మాన్ ఖతెర్ మాట్లాడుతూ, కారు టైరు పేలిన వెంటనే, అదుపు తప్పిన కారు సిమెంట్ బ్యారియర్‌ని ఢీకొన్నట్లు చెప్పారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెంటనే, మంటలు వ్యాపించాయి. రెస్క్యూ సిబ్బంది సమాచారం అందుకుని, ఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మంటల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాన్ని 'మార్గ్యు'కి తరలించారు. కారుకి అగ్ని ప్రమాదం సంభవించిన విషయాన్ని వీడియోగా చిత్రీకరించి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడాన్ని అధికారులు తప్పుపట్టారు. ఈ తరహా వీడియోల్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







