ఐదేళ్ళ బాలుడికి పోర్న్‌ వీడియోలు చూపిన తండ్రి

- November 06, 2017 , by Maagulf
ఐదేళ్ళ బాలుడికి పోర్న్‌ వీడియోలు చూపిన తండ్రి

తన ఐదేళ్ళ కుమారుడికి ఓ తండ్రి పోర్న్‌ వీడియోలు చూపిస్తున్నట్లు, ఓ మహిళ తన మాజీ భర్తపై ఫిర్యాదు చేసింది. గతంలో నిందితుడికి వేరొకరితో లైంగిక సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానం 5,000 దిర్హామ్‌ల జరీమానా, అలాగే దేశ బహిష్కరణను విధించింది. చైనాకి చెందిన ఓ మహిళతో లైంగిక సంబంధం పెట్టుకున్న కారణంగా తన భర్తకు బాధితురాలు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత తనకుమారుడి ప్రవర్తనలో మార్పుని గమనించిన బాధితురాలు, విషయం ఆరా తీస్తే, ఐదేళ్ళ తన కుమారుడికి తన మాజీ భర్త పోర్న్‌ వీడియోలు చూపిస్తున్నట్లు గుర్తించింది. ఈ కారణంగా తన కుమారుడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, మాజీ భర్త నుంచి తన కుమారుడ్ని వేరు చేసి తనకు అప్పగించాలని ఆమె న్యాయస్థానాన్ని కోరింది. మెడికల్‌ రిపోర్ట్స్‌లోనూ బాలుడి వింత ప్రవర్తన, అలాగే నిద్రలేమి, వయొలెంట్‌ డిస్టర్బ్‌డ్‌ బిహేవియర్‌ కలిగి ఉన్నట్లు తేలింది. 2011లో జన్మించిన ఆ చిన్నారి పోర్న్‌ వీడియోస్‌ చూస్తున్నట్లు మానసిక వైద్యులు గుర్తించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com