డ్రైవర్ లేకుండాపోతున్న రైలును ఛేజ్ చేసి ఆపిన వైనం
- November 09, 2017
డ్రైవర్ లేకుండానే రైలింజన్ పట్టాలపై పరుగులు తీస్తే.. అదీ.. ఏకధాటిగా 13 కిలోమీటర్ల మేర దూసుకుపోతే పరిస్థితి ఎలా ఉంటుంది.. అదే భీతావహ పరిస్థితి ఎదురైంది ఇవాళ. కర్నాటకలోని వాడి జంక్షన్లో రైలుకు ఇంజన్ మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సడెన్ గా స్టార్ట్ అయిన డీజిల్ ఇంజన్ పట్టాలపైకి పరుగు లఘించుకుంది. ఇలా ఏకంగా 13కిలోమీటర్లు వెళ్లిపోయింది. ఇంజన్ ను ఆపేందుకు బైక్ తో ఛేజ్ చేసిన సిబ్బంది ఎలాగోలా ఇంజన్ లోకి వెళ్లి అదుపులోకి తెచ్చారు. తర్వాతి స్టేషన్ ను అప్రమత్తం చేయడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా చేయగలిగామని అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని వాడి జంక్షన్ నుంచి సోలాపూర్ మధ్యన ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







