భారత ఎయిమ్స్‌ జూనియర్ డాక్టర్కు 'పుతిన్' ప్రశంస

- November 10, 2017 , by Maagulf
భారత ఎయిమ్స్‌ జూనియర్ డాక్టర్కు 'పుతిన్' ప్రశంస

ఆలిండియా ఇనిస్ట్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌) జూనియర్‌ డాక్టర్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రశంసించారు. రష్యాలో వరల్డ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ యూత్‌ అండ్‌ స్టూడెంట్స్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 185 దేశాల నుంచి 24వేల మంది పాల్గొన్నారు.వారిలో 12 మంది విద్యార్థులను ఫైనల్‌కు ఎంపిక చేసి పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం కల్పించారు. భారత్‌ నుంచి వచ్చిన డాక్టర్‌ రచ్చా భట్‌ ఈ కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచి పుతిన్‌ అభినందనలు పొందారు. యాంటీ బయోటిక్స్‌ రెసిస్టెన్స్‌ అంశంపై డాక్టర్‌ రచ్చా భట్‌ చేసిన ప్రెజెంటేషన్‌ను సహచర విద్యార్థులు సైతం అభినందించారు. డాక్టర్‌ భట్‌ 2015 నుంచి ఎయిమ్స్‌లో జూనియర్‌ రెసిడెంట్‌గా ( ఎమర్జెన్సీ మెడిసిన్స్‌ విభాగంలో ) పనిచేస్తున్నారు. వైద్యులు, రోగుల కోసం ఆమె రూపొందించిన ఇ-పోర్టల్‌ విధానం గురించి వివరించారు. ఈ విధానం ద్వారా రోగి వివరాలను సేకరించిన వైద్యులు ఆన్‌లైన్‌లోనే ఎలక్ట్రానిక్స్‌ ప్రెస్కిప్షన్‌ అందజేయవచ్చు. సకాలంలో ఆస్పత్రికి చేరలేని రోగులకు ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుందని భట్‌ వివరించారు. భట్‌ ప్రతిభను ఎయిమ్స్‌ డీన్‌ ( అకడమిక్స్‌ ) ప్రొఫెసర్‌ బల్‌రామ్‌ ఐరాన్‌ ప్రశంసించారు.
భారత్‌ ప్రతిష్టను భట్‌ విదేశాల్లోనూ ఇనుమడించారని అన్నారు. భట్‌ ప్రతిభావంతురాలని ప్రశంసించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com