రియాద్ సమీపంలో ఒంటెల పోటీ కోసం కొత్త బాట నిర్మించటానికి ఏర్పాట్లు

- November 10, 2017 , by Maagulf
రియాద్ సమీపంలో ఒంటెల పోటీ కోసం కొత్త బాట  నిర్మించటానికి ఏర్పాట్లు

రియాద్ : ' వంకర టింకరగా వయ్యారాలు పోతూ...తమ భారీ శరీరాలను ఎగుడు దిగుడుగా కదుపుతూ ఉరుకులు పరుగులతో గమ్యంకు చేరుకొనే లొట్టి పిట్టల పోటీలను ' చూసేందుకు అరబ్ ప్రజలు అత్యంత ఆసక్తి చూపుతారు. కింగ్ అబ్దుల్ అజీజ్ కామెల్ ఫెస్టివల్ లో భాగంగా ఈ సంవత్సరం ఒంటెల పరుగుల పోటీని నిర్వహించాలని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశించారు. ఈ మేరకు సౌదీ ఒంటె గ్రామంలో ఉన్నత స్థాయి ప్రత్యేక బాటను నిర్మించాలని ఆయన  ఆదేశించారు. కిరీటధారి ఐన యువరాజు కింగ్ సల్మాన్ యొక్క మార్గదర్శకాలు సంరక్షణ విధానాలు  ఒంటెల పోటీలు మరియు జానపద క్రీడలలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరియు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ ఒంటె క్రీడల అభివృద్ధికి ఇచ్చిన ప్రత్యేక శ్రద్ధ, మరియుప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిష్టాత్మక దృష్టితో నిర్వహించాలని ఆయన అభిలాషించారు. సౌదీ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సాహంగా జరుపుకునేందుకు ఉద్దేశించిన ఈ ఒంటెల పోటీలు నెల రోజుల పాటు జరగనున్నాయి .రియాద్ కు ఉత్తరాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుమాహ్ ప్రాంతంలో జరిగిన అబ్దుల్ అజీజ్ కామెల్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ముగింపు కార్యక్రమానికి  సల్మాన్ ముఖ్య అతిధిగా పాల్గొననున్నారు. సౌదీ సంస్కృతిని ప్రతిభింబించే విధంగా1,400 ఒంటెల యజమానులను వేర్వేరు గల్ఫ్ దేశాల నుంచి వేలసంఖ్యలో ఒంటెలను తమ వెంట తీసుకురానున్నారు.  ఐదు వేర్వేరు విభాగాలలో నిశితమైన తీర్పునిచ్చి నాలుగు కాళ్ల సూపర్ ఒంటె మోడల్ రకాలకు  మొత్తం 270 బహుమతులు ఇవ్వనున్నారు.ఈ పోటీ - అరబిక్ లో "మజాయెన్ అల్-ఇబ్ల్" లేదా "అందమైన ఒంటెలు" అని పిలవబడే పోటీగా ప్రసిద్ధి. ఒంటెల పోటీలలో నిపుణులైన బెడుయిన్స్ జ్యూరీ ఈ ఒంటె పోటీలను  పర్యవేక్షిస్తుంది. స్థానిక బెడౌయిన్ ప్రజల సమూహం 1999 లో ఈ ఒంటెల పోటీని ప్రారంభించారు. ఈ పోటీకి మరింత ఆకర్షణ ఆర్ధిక సహాయం నిమిత్తం ఈ ఒంటెల పోటీ నిర్వాహకులు  సౌదీ రాజ కుటుంబాన్నీ కలిసి  మద్దతు కోరారు. ఏ ఏడాది కా ఏడాది  పెరుగుతున్న జనాదరణ కారణంగా ఇది ఒక దేశ వారసత్వ పండుగగా మారి, ప్రజలను విస్తృతంగా ఆకర్షిస్తోంది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాల నుండి వందలాది పోటీదారులు వారి అత్యుత్తమ సుందరమైన ఒంటెలను ప్రదర్శించడానికి ఇక్కడకు  ప్రయాణమవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com