బంగ్లాదేశ్‌లో 30 హిందువుల ఇళ్ళు దగ్ధం
- November 11, 2017
బంగ్లాదేశ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హిందువుల ఇళ్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. రంగ్‌పూర్ జిల్లా థాకుర్‌పారా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామంలో మైనార్టీ కమ్యూనిటీకి చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్టు చేసినట్లు పుకార్లు వ్యాపించడంతో ఆందోళనకారులు దాడికి దిగారు. చుట్టుపక్కల ఆరు, ఏడు గ్రామాలకు చెందిన దాదాపు 20వేల మంది ఆందోళనకారులు థాకుర్‌పారా గ్రామంలోని హిందువులపై దాడి చేశారు. హిందువులకు చెందిన 30 ఇళ్లను కొల్లగొట్టి వాటికి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
శాంతి, భద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి, రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించి 33 మంది ఆందోళనాకారులను నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రంగ్‌పూర్-దినాజ్‌పూర్ హైవేపై ఆందోళనకు దిగారు. రహదారిని మూసివేసి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







