బంగాళాదుంప హల్వా

- November 11, 2017 , by Maagulf
బంగాళాదుంప హల్వా

కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు - 6 (తొక్క తీసి తురుముకోవాలి) 
నెయ్యి - అర కప్పు 
పాలు - 1 కప్పు 
పంచదార పొడి - ఒకటిన్నర కప్పు 
యాలకుల పొడి - 1 టీస్పూను 
జీడిపప్పు, బాదం పప్పు - 1 టీస్పూను

తయారీ విధానం:
బాండీలో నెయ్యి వేసి బంగాళాదుంపల తరుగు వేసి వేయించుకోవాలి. 
ఈ తరుగును ఎంత ఎక్కువసేపు వేయిస్తే హల్వా అంత రుచిగా ఉంటుంది. 
తర్వాత పాలు, పంచదార పొడి వేసి కలపాలి. 
చిక్కబడేవరకూ ఉడికించి చివర్లో బాదం, జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి చల్లి దింపేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com