దుబాయ్‌లో రోడ్డు ప్రమాదాలు: ఒకరి మృతి, 8 మందికి గాయాలు
- November 11, 2017
గత వారం కేవలం మూడు రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయాల పాలైనట్లు దుబాయ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అల్ అవీర్ ప్రాంతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయారు. మరో రోడ్డు ప్రమాదంలో ఆరు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇంకో ఘటన దుబాయ్ - అల్ అయిన్ రోడ్డులో జరిగింది. నాలుగు వాహనాలు ఈ ప్రమాదంలో ఇరుక్కున్నాయి. ఇంకో వైపున గడచిన పది నెలల్లో దుబాయ్ రోడ్లపై ట్రక్కుల కారణంగా 62 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 12 మంది చనిపోగా, 82 మందికి గాయాలయ్యాయి ఈ ప్రమాదాల్లో. రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే ఈ ప్రమాదాలకు కారణం.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







