ఫ్రీ కండోమ్స్..69 రోజులు 10 లక్షల విక్రయాలు.!
- November 11, 2017
దేశంలోని శృంగార పురుషులు కండోములను విచ్చలవిడిగా ఉపయోగించేస్తున్నారు. గర్భధారణ నిరోధక సాధనాల మార్కెట్లో కేవలం 5 శాతం ఉన్న కండోముల అమ్మకాలు.. ఆన్‌లైన్‌లో ఫ్రీ కండోమ్ స్టోర్ ఆరంభించాక.. ఒక్కసారిగా డిమాండ్‌ఆకాశాన్ని అంటుకుంది. ఆన్ స్టోర్ ప్రారంభించిన 69 రోజుల్లోనే 10 లక్షల కండోములను ఉచితంగా డెలివరీ చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది.
ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ అనే సంస్థ ఏప్రిల్ 28న ఆన్‌లైన్‌లో ఫ్రీ కండోమ్ స్టోర్‌ను ఆరంభించింది. ఈ స్టోర్‌లో ఇప్పటి వరకూ 9.56 లక్షల కండొమ్‌లను ఉచితంగా పంపిణీ చేసినట్లు సంస్థ తెలిపింది. ఎన్‌జీవో సంస్థలు, ఇతర వర్గాలకు 5.14 లక్షల కండోములు సరఫరా చేయగా.. వ్యక్తిగత ఆర్డర్లు 4.41 లక్షలు వచ్చినట్లు సంస్థ తెలిపింది.
ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో కండోములకు అధికంగా డిమాండ్ ఉన్నట్లు ఆర్డర్ల ద్వారా తెలుస్తోంది. దేశంలోని శృంగార పురుషుల కోసం హిందుస్తాన్ లేటెక్స్ లిమిటెడ్ ఈ కండోములను ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు ఎయిడ్స్ హెల్త్ కేర్ ఫౌండేషన్ ఇండియా డైరెక్టన్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
డిసెంబర్ నెలాఖరు వరకు 10 లక్షల కండోములు వస్తాయని అంచనా. అయితే స్టోర్ ప్రారంభించిన కొద్ది రోజులకే స్టాక్ పూర్తవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, తాజాగా 20 లక్షల కండోములకు ఆర్డర్ ఇచ్చినట్లు శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మరో 50 లక్షల కండోములు జనవరికల్లా అందుబాటులోకి తెస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







