'హలో'కి నాగార్జున వాయిస్‌.!

- November 11, 2017 , by Maagulf
'హలో'కి నాగార్జున వాయిస్‌.!

అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్నచిత్రం 'హలో'. కల్యాణి కథానాయికగా నటిస్తోంది. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం టీజర్‌ విడుదల కాబోతోంది. అయితే టీజర్‌లో అఖిల్‌ తండ్రి నాగార్జున వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 22న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌ కారణంగా విడుదల ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com