కేరళలో వివాదాస్పదంగా మారిన లవ్ జిహాద్
- November 12, 2017
కేరళలో వివాదాస్పదంగా మారిన లవ్ జిహాద్ ఉదంతాల్లో కొత్త పరిణామం తెరమీదకు వచ్చింది. మాటలతో ఏమార్చి.అనంతరం శారీరకంగా లొంగదీసుకొని.వీడియోలు తీసి. మతం మార్పించి పెళ్లి చేసుకొని.ఆపై అంతర్జాతీయ రాక్షస మూఠాకు అమ్మేసేందుకు సిద్ధమైపోయారు. ఈ షాకింగ్ పరిణామం కలకలం మారింది. తమ పెళ్లిని రద్దు పర్చాలని కేరళకు చెందిన ఓ మహిళ (25)ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. భర్త బలవంతంగా తనను ఇస్లాంలోకి మార్చాడని, సెక్స్ బానిసగా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులకు అమ్మాలని ప్రయత్నించాడని పిటిషన్ దాఖలుచేశారు.
గుజరాత్లో పుట్టి పెరిగి కేరళలో నివసిస్తున్న ఓ మహిళ.. బెంగళూరులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సభ్యుడు మహ్మద్ రియాజ్‌ను గతంలో కలిశారు. వారి పరిచయాలు స్నేహంగా మారడంతో వారు పెళ్లి చేసుకున్నారు. అప్పటి తమ ప్రైవేట్ వీడియోను దగ్గర పెట్టుకొని, బెదిరించి బలవంతంగా మతం మార్పించాడని ఆ మహిళ పిటిషన్లో పేర్కొన్నారు. తనను సౌదీ అరేబియాకు తీసుకెళ్లడమే రియాజ్ ఉద్దేశంగా కనిపించిందని, అక్కడికెళ్లాక అతడి నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. దీంతో తల్లిదండ్రులను సంప్రదించి సౌదీ నుంచి తప్పించుకున్నానని వివరించారు. జకీర్ నాయక్ వీడియోలు చూడాలని, ఇస్లామిక్ బోధనలు వినాలని రియాజ్ బలవంతం చేసేవాడని, గతనెల అక్టోబర్ మొదటివారంలో సిరియా వెళ్లాలని రియాజ్ ప్రణాళిక వేశాడని, కానీ తప్పించుకొని అదేనెల 5న అహ్మదాబాద్‌కు చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు.
పీఎఫ్ఐ సభ్యులు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నారనే అంశంపై ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిఘా పెట్టింది. తాజా ఉదంతం తెరమీదకు రావడంతో ఈ సంస్థ కార్యకలాపాలపై ఆరాతీస్తోంది. కాగా, ప్రేమ పేరుతో కేరళలో ముస్లిం యువత జరుపుతున్న వివాహాల్లో కుట్ర కోణం ఉందనే తమ ఆరోపణ నిజమైందని ఆ రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







