భారత్ కు షాక్ ఇచ్చిన యునైటెడ్ ఎయిర్లైన్స్

- November 12, 2017 , by Maagulf
భారత్ కు షాక్ ఇచ్చిన యునైటెడ్ ఎయిర్లైన్స్

న్యూఢిల్లీ : ఢిల్లీ ఆవరించిన పొగమంచు, వాతావరణ కాలుష్యం విమాన సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉండడంతో పాటు, ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ చూపుతున్న ప్రమాదకర గణాంకాలతో యునెటైడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ న్యూయార్క్‌- ఢిల్లీ విమానసేవలను తాత్కాలికంగా నిలిపేసింది. మరో వారం రోజుల పాటు ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతో యెనైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

పలు క్లిష్టపరిస్థితుల్లోనపూ విమాన సేవలు అందిస్తున్న పలు సంస్థలు.. విమాన సర్వీసులును రీ షెడ్యూల్‌ చేయడం. ఆలస్యంగా నడపడం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ తీసుకున్న నిర్ణయం మిగిలిన విమాన సంస్థలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయోనని పౌర విమానయాన శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com