రక్త సంద్రాన్ని తలపిస్తున్న వేల్స్ వధ
- November 12, 2017
ఫరో ఐలాండ్స్: వందల సంఖ్యలో డాల్ఫిన్లు, వేల్స్‌లను వధిస్తున్న ఫొటోలు డెన్మార్క్‌లో కలకలం రేపాయి. పర్యాటకుల్లా వధ జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించిన 'సీ షెపర్డ్' అనే ఓషన్ కన్జర్వేషన్ గ్రూప్ సభ్యులు ఈ ఫొటోలను వెలుగులోకి తీసుకొచ్చారు. డెన్మార్క్‌లోని ఫరో ఐలాండ్‌లోని తొమ్మిది ప్రదేశాల్లో ఈ వధలు జరుగుతున్నట్లు కన్జర్వేషన్ గ్రూప్ పేర్కొంది.
గ్రూప్ సభ్యులు తీసిన చిత్రాల్లో డాల్ఫిన్లు, వేల్స్‌ల రక్తంతో సముద్ర నీరు ఎర్రగా మారింది. "స్పెనల్ లాన్స్"తో వాటి వెన్నుపూసలను క్రూరంగా తెగ నరుకుతున్నట్లు సీ షెపర్డ్ సభ్యులు తెలిపారు. మొత్తం 198 డాల్ఫిన్లు, 436 పైలట్ వేల్స్ వధకు గురైనట్లు వెల్లడించారు. గత వేసవిలో ఈ వధలు జరిగినట్లు పేర్కొన్నారు.
సీ షెపర్డ్ ఫొటోలపై స్పందించిన ఫరో ఐలాండ్ ప్రభుత్వం ఈ ఏడాది 1,700 పైలట్ వేల్స్‌ను వధించినట్లు పేర్కొంది. అయితే, వేల్స్‌ను చంపడాన్ని 'శాడిస్టిక్ సైకోపాత్' అని సీ షెపర్డ్ పేర్కొనడంపై మండిపడింది. ఐలాండ్ పరువు తీసేందుకు సీ షెపర్డ్ యత్నిస్తోందని ఆరోపించింది.
పైలట్ వేల్స్‌ను వేటాడి ఆహారంగా తీసుకోవడం ఐలాండ్‌లో ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోందని చెప్పింది. వేల్స్‌ను వేటాడటం ఆపేస్తే విదేశాల నుంచి పౌరులకు అవసరమైన ఆహారం దిగుమతి చేసుకోవాల్సివస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







