క్యాండిల్ లైట్ డిన్నర్ లో వీర్ నన్ను ప్రపోజ్ చేశాడు - నమిత
- November 12, 2017
బొద్దుపిల్ల నమిత తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పష్టతఇచ్చారు. తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించారు. తమ వివాహం ఈనెల 24వ తేదీన తిరుపతిలో జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ, తన భర్త గురించి, తమ ప్రేమ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
వీరు తనకు బెస్ట్ ఫ్రెండ్ అని... అతను నిర్మాత మాత్రమే కాదు మంచి నటుడు కూడా అని చెప్పింది. తమది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అని చెప్పింది. తమ కామన్ ఫ్రెండ్ శశిధర్ 2016లో తనకు వీర్‌ను పరిచయం చేశాడని... అలా తమ మధ్య స్నేహం ప్రారంభమైందన్నారు.
2017 సెప్టెంబర్ 6న బీచ్‌లో క్యాండిల్ లైట్ డిన్నర్‌ను ఏర్పాటు చేసి, వీర్ తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది. అలాంటి సర్ప్రైజ్ను తాను ఊహించలేదని... అయితే, తమ అభిరుచులు, అభిప్రాయాలు ఒకటే కావడంతో... వీర్ ప్రపోజల్‌కు ఓకే చెప్పేశానని తెలిపింది.
ఈ మూడు నెలల కాలంలో వీర్‌ను తాను ఎంతో అర్థం చేసుకున్నానని చెప్పింది. వాస్తవానికి మగవాళ్ల పట్ల తనకు నమ్మకం పోయిందని... కానీ, వీర్‌ను చూసిన తర్వాత పోయిన నమ్మకం మళ్లీ కలిగిందని తెలిపింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







