"జై సింహా" భారీ వైజాగ్ షెడ్యూల్ పూర్తి

- November 12, 2017 , by Maagulf

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ "జై సింహా". బాలకృష్ణ సరసన నయనతార, నాటాషా జోషీ, హరిప్రియలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం వైజాగ్‌లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 
వైజాగ్ బీచ్ రోడ్ లో 5000 వేల జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో మహా ధర్నా సీక్వెన్స్ తెరకెక్కించారు. అలాగే బాలకృష్ణ-హరిప్రియల పై ఓ రోమాంటిక్ సాంగ్ ను చిత్రీకరించారు.  ఈ సినిమాకు సంబంధించిన బాలయ్య, నయనతారపై ఓ మాంటేజ్ సాంగ్ ను కూడా షూట్ చేశారు. ఇప్పటివరకూ బాలయ్య కెరీర్ లో "సింహా" అనే టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయినట్లే "జై సింహా" కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని చిత్రయూనిట్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com