ఖుర్మ్ బీచ్‌లలో ఎల్ఈడీ లైట్లు: మస్కట్ మునిసిపాలిటీ
- November 13, 2017
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ ఖుర్మ్ ప్రాంతంలోని బీచ్ రోడ్లపై ఎల్ఈడీ స్ట్రీట్ లైట్స్‌ని ఏర్పాటు చేస్తోంది. అల్ షట్టి స్ట్రీట్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మునిసిపాలిటీ అధికారి ఒకరు చెప్పారు. పాత ఎల్లో లైట్స్‌ని కొత్త లైట్లతో రీప్లేస్ చేస్తున్నారు. వింటర్ సీజన్లో పర్యాటకులకు ఈ లైట్లు బీచ్‌లో కొత్త అనుభూతిని కలిగిస్తాయని ఆ అధికారి వివరించారు. బీచ్ వ్యాప్తంగా పర్యాటకులు పలు రకాలైన ఆటల్ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడ్తారనీ, వీకెండ్స్‌లో ఎక్కువగా బీచ్‌లోకి సందర్శకులు వస్తుంటారనీ, అలాంటివారికోసం మెరుగైన వసతుల్ని కలిగిస్తున్నామని మునిసిపాలిటీ పేర్కొంది. ఈ ప్రాంతంలో మస్కట్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హోటల్స్ సందర్శకులకు, పర్యాటకులకు విశేషమైన సేవల్ని అందిస్తున్నాయి. ఇతర బీచ్‌లలో కూడా ఇదే తరహా లైటింగ్ ఏర్పాట్లు చేస్తామని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







