ఇరాక్‌లో భూకంపం: బహ్రెయిన్‌లో చిన్న చిన్న ప్రకంపనలు
- November 13, 2017
మనామా: రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో ఇరాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దాటికి 200 మంఇకి పైగా మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇంకో వైపున ఇరాన్ భూకంపం నేపథ్యంలో బహ్రెయిన్‌లోనూ కొన్ని చోట్ల చిన్న పాటి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. లీ క్రో అనే బహ్రెయినీ నివాసితుడు, తన భవనం కాస్సేపు కదిలినట్లుగా అనిపించిందని ఓషల్ మీడియాలో ట్వీట్ చేశారు పలువురు బహ్రెయినీలు ఈ ప్రకంపనల అనుభూతిని చవిచూశారు. కువైట్‌లోనూ అక్కకడక్కడా ప్రకంపనల అనుభూతికి లోనయినట్లు కువైటీలు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 40 వరకు పోన్ కాల్స్ కువైట్ నివాసితుల నుంచి వచ్చాయని, అయితే ఎలాంటి ప్రమాదాలూ చోటు చేసుకోలేదని కువైట్ ఫైర్ సర్వీసెస్ డరెక్టరేట్ పేర్కొంది. కువైట్‌లో 4 నుంచి 5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇరాక్ ప్రావిన్స్‌లోని సులైమానియా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!