కేరళలోని కొచ్చిన్ విమానంలో హైజాక్ కలకలం
- November 13, 2017
బాంబుతో విమానాన్ని హైజాక్ చేస్తానంటూ బెంబేలెత్తించిన ప్రముఖ మ్యూజిక్ ఛానెల్ ప్రయోక్త (యాంకర్)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబయికి 170 మందితో వెళ్లాల్సిన జెట్ ఎయిర్‌వేస్ 9డబ్ల్యూ 825 విమానంలో త్రిస్సూర్‌కు చెందిన 26 ఏళ్ల క్లిన్స్ వర్గీస్ టికెట్ బుక్‌చేసుకున్నారు. అయితే విమానం ఎక్కే సమయంలో ఆయన చరవాణితో ఓ వీడియో తీశారు. తన దగ్గరున్న 'హ్యాపీ బాంబ్'తో కొద్దిసేపట్లో విమానాన్ని హైజాక్ చేయబోతున్నానని ఓ సందేశాన్నీ పంపారు. అంతేకాదు ఈ విషయాన్ని తనతోపాటు వచ్చిన మరో ప్రయాణికుడికీ చెప్పారు. ఈ సంగతి గమనించిన సిబ్బంది భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. దీంతో వెంటనే ప్రయాణికులందరినీ సిబ్బంది బయటకు పంపించారు. వర్గీస్ బ్యాగ్ సహా విమానం మొత్తం జాగ్రత్తగా తనిఖీలు చేపట్టారు. వర్గీస్‌ను తోటి ప్రయాణికుడితోపాటు పోలీసులకూ అప్పగించారు.
ఘటన కారణంగా విమానం రెండు గంటలు ఆలస్యంగా వెళ్లింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







