విశ్వ కర్మ క్రియేషన్స్ పతాకం పై ఒక షీ టీమ్ పోలీస్ ఆఫీసర్ కథ.... మూవీగా

- November 13, 2017 , by Maagulf
విశ్వ కర్మ క్రియేషన్స్ పతాకం పై ఒక షీ టీమ్ పోలీస్ ఆఫీసర్ కథ.... మూవీగా

విశ్వ కర్మ క్రియేషన్స్ పతాకం పై లక్ష్మణ్ కంచరి దర్శకనిర్మాతగా గౌతమి, శిరీష్ ముఖ్యతారాగణంతో నిర్మిస్తున్న చిత్రం లక్ష్మి నిలయం. ఈ చిత్రం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభం అయింది. ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్య అతిధి గా విచ్చేసి ముహూర్తం షాట్ కి క్లాప్ ఇచ్చి శుభారంభం పలికారు. దర్శకనిర్మాత లక్ష్మణ్ కంచరి తండ్రిగారు ఈశ్వరయ్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా తన సోదరుడు వెంకటేష్ తొలిషాట్ డైరెక్షన్ చేసారు. 
అనంతరం పాత్రికేయుల సమావేశంలో దర్శకనిర్మాత లక్ష్మణ్ కంచరి మాట్లాడుతూ "ఇది ఒక షీ టీమ్ పోలీస్ ఆఫీసర్ కథ. సమాజం లో మహిళపై వేధింపులు ఎలా ఉన్నాయి వాటిని మహిళలు ఎలా ఎదురుకోవాలి , షీ టీమ్ ని ఎలా సంప్రదించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కథాంశం తో నిర్ణిస్తున్న చిత్రం ఇది. డిసెంబర్ రెండో వారం లో చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ మరియు మెదక్ పరిసరప్రాంతాలలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి లో షూటింగ్ పూర్తిచేసుకొని ఏప్రిల్ లో చిత్రం విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం. నటీనటులు : గౌతమి, శిరీష్ , కథ, స్క్రీన్ ప్లే దర్శకుడు నిర్మాత : లక్ష్మణ్ కంచరి, కెమరామెన్ : ఏ కే ఆనంద్, ఎడిటింగ్ : నందమూరి హరి, సంగీతం యాజమాన్య 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com