నాగ శౌర్య 'చలో' రిలీజ్ డేట్
- November 14, 2017
ఊహలు గుసగుసలాడే చిత్రం తో హీరోగా యూత్ కు బాగా దగ్గరైన నాగ శౌర్య , ఆ తర్వాత 'దిక్కులు చూడకు రామయ్య, కళ్యాణ్ వైభోగమే, జ్యో అచ్యుతానంద' చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఈ మధ్య 'నీ జతలేక' మూవీ పరాజయం కావడం తో కాస్త వెనుక పడ్డ శౌర్య , తాజాగా చలో తో మళ్లీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని చూస్తున్నాడు.
త్రివిక్రమ్ అసిస్టెంట్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అయ్యింది. డిసెంబర్ 29 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. నాగ్ శౌర్య సొంత బ్యానర్ 'ఐరా క్రియేషన్స్' పై ఉషా మూల్పూరి, శంకర ప్రసాద్ మూల్పూరి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ 'కిరిక్ పార్టీ' సినిమా హీరోయిన్ రష్మిక మందన్న ఈ చిత్రంలో నాగ శౌర్య కు జంటగా నటిస్తోంది. మణిశర్మ తనయుడు సాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







