దీపావళి సందడి
- November 10, 2015
తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందడి మొదలైంది. బాణసంచా దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి.వెలుగుల దీపావళి పండుగలో ప్రమిదలు, బొమ్మలు, టపాసులే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. ప్రమిదలు, బొమ్మల కోసం ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. కొనుగోలుదారులతో ఈ షాపులన్నీ కళకళలాడుతున్నాయి. వివిధ దీపాలతో ఇళ్లను అందంగా అలంకరిస్తున్నారు. ఈ దీపాల కాంతుల్లో ఇళ్లు దగధగమంటున్నాయి. బెంబేలెత్తిస్తున్న బాణ సంచా రేట్లు... మరోపక్క బాణసంచా రేట్లను చూసి వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ధరలు చూసి దీపావళి ఆనందం సగం ఆవిరి అయిపోతోంది. గతేడాదితో పోల్చితే రేట్లు రెట్టింపు అయ్యాయి. పండగ రోజు కావడంతో రేట్లు మరింత ఆకాశాన్నంటుతున్నాయి. తగ్గిన బాణాసంచా తయారీ ... ఇది ఇలా ఉంటే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో బాణసంచా కొనుగోళ్లు తగ్గిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వీటి ప్రభావం కొనుగోళ్లపై పడింది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కురిసిన వర్షాల దెబ్బకు బాణసంచా అమ్మకాలు భారీగా దిగజారాయి. తిరుపతిలో అమ్మకం దారులు గొగ్గోలు పెడుతున్నారు. తమ పెట్టుబడులైనా తిరిగివస్తాయో రావో అని వ్యాపారుల్లో దిగులుమొదలైంది. టపాసులు కాల్చవద్దంటున్న పర్యావరణ వేత్తలు .. మరోపక్క టపాసులు కాల్చకుండా దీపావళిని జరుపుకోవాలని పర్యావరణవేత్తలు పిలుపునిస్తున్నారు. క్రాకర్స్ విపరీతంగా కాల్చడం వల్ల శబ్ధ కాలుష్యంతో పాటు... పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో నూ .... వెలుగుల దీపావళి పండుగలో ప్రమిదలు, బొమ్మలకు, టపాకాయలే స్పెషల్ అట్రాక్షన్... గుమ్మంనుంచి ఇంటిఆవరణవరకూ అలంకరణతో ఇళ్లన్నీ మెరిసిపోతూ ఉంటాయి.. దీపాల కాంతులతో ధగధగమంటాయి.. అటు ప్రమిదలు, బొమ్మల తయారీదారులు, వ్యాపారులకు మంచి గిరాకీ ఉంటుంది.. హైదరాబాద్‌లో ఈ వస్తువులతో ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి.. కొనుగోలుదారులతో ఈ షాపులన్నీ కళకళలాడుతున్నాయి.. మట్టి ప్రమిదల్లో దీపాలు..... దీపావళి రోజున మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తారు.. ఈమధ్య వివిధ రకాల వస్తువులు అందుబాటులోకివచ్చాయి.. సంప్రదాయ ప్రమిదలకుతోడు ఆకట్టుకునే డిజైన్లు ఇప్పుడు అందరినీ ఆకర్శిస్తున్నాయి.. ఇక అలంకరణలో దేవతామూర్తుల ప్రతిమలకు డిమాండ్ పెరుగుతోంది.. బొమ్మలకొలువుకోసం వివిధరకాల ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు మహిళలు.. పండుగరోజు రష్ ఎక్కువగా ఉంటుందంటూ ముందుగానే వస్తువులు కొనేస్తున్నారు జనాలు.. దీపావళిని మరింత సంతోషంగా గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు..
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







