దీపావళి కానుకగా ఈరోజు 'తను నేను' ట్రైలర్ విడుదల
- November 10, 2015
అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్ పి. ఇప్పుడు దర్శకుడుగా మారారు. అవికా గోర్ హీరోయిన్గా, 'వర్షం' దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్ సినిమా, వయాకామ్ 18 పిక్చర్స్ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రామ్మోహన్ పి. నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'తను నేను' షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను దీపావళి కానుకగా ఈరోజు విడుదల చేశారు. నవంబర్ 11 నుండి 'అఖిల్' చిత్రంతోపాటు 'తను నేను' ట్రైలర్ కూడా ప్రదర్శించబడుతుంది. సన్ని ఎం.ఆర్. సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో నవంబర్ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అవికా గోర్, సంతోష్ శోభన్, అల్లరి రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఎస్.రవీందర్, నిర్మాణం: సన్‌షైన్ సినిమాస్
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







