వాట్సాప్‌లో కొత్త ఫీచర్

- November 16, 2017 , by Maagulf
వాట్సాప్‌లో కొత్త ఫీచర్

వాట్సాప్‌ ప్రవేశపెట్టిన 'డిలీట్‌ ఎవ్రీవన్‌' ఫీచర్‌ ద్వారా మనం అవతలి వ్యక్తికి పంపిన సందేశాన్ని ఏడు నిమిషాల్లోపు తొలగించవచ్చు. కానీ తాజాగా స్పానిష్‌ ఆండ్రాయిడ్‌ బ్లాగ్‌ ఆండ్రాయిడ్‌ జెఫీ ఈ ఫీచర్‌కు ప్రత్యామ్నాయం కనుగొంది. తొలగించిన సందేశాలను వాటిని అందుకున్న వ్యక్తి తిరిగి పొందవచ్చని తాజా నివేదిక వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌ లేదా హైవెర్షన్‌లోని యాప్‌ ద్వారా మెసేజ్‌ పంపిన వ్యక్తి తొలగించిన సందేశాలను తిరిగి పొందవచ్చని పేర్కొంది. ఈ యాప్‌ ద్వారా కేవలం టెక్ట్స్‌ సందేశాలను మాత్రమే పొందగలమని, ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని పొందలేమని పేర్కొంది.
ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే యాప్‌ ద్వారా తొలగించిన సందేశాలను తిరిగి పొందడానికి కొన్ని పరిమితులను విధించింది. కేవలం 100 అక్షరాలను మాత్రమే కనిపించేలా చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com