కార్న్‌ఫ్లోర్‌ స్వీట్‌

- November 17, 2017 , by Maagulf
కార్న్‌ఫ్లోర్‌ స్వీట్‌

కావలసిన పదార్థాలు: కార్న్‌ఫ్లోర్‌ - 1 కప్పు, పాలు - 3 కప్పులు, నెయ్యి - 2 టీ స్పూన్లు, జీడిపప్పు - 10, పంచదార - ఒకటిన్నర కప్పు.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో పంచదార, కార్న్‌ఫ్లోర్‌ వేసి ఉండలు చుట్టకుండా పాలు కలపాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టాలి. పాన్‌లో ఈ మిశ్రమం వేసి సన్నని మంటపై చిక్కబడేదాక గరిటెతో తిప్పుతుండాలి. తర్వాత ప్లేట్‌లో నెయ్యి వేసి సమానంగా సర్దాలి (పదినిమిషాలు ఉంచితే చల్లబడుతుంది). ఈ లోపుగా జీడిపప్పుని నేతిలో వేగించి (పూర్తి మెత్తగా కాకుండా) పొడి చేసుకొని మిశ్రమంపై చల్లాలి. తర్వాత మీకు నచ్చిన షేపుల్లో కట్‌ చేసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com