కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలేసి మంచం కింద పెడితే?
- November 17, 2017
వర్షాకాలంలో కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలేసి మంచం కింద పెడితే దోమల బెడద తగ్గుతుంది. అలాగే వర్షాకాలం ఇంటిని వేడి నీటిలో శుభ్రపరచయం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. జ్వరం, బలుబు వంటి రుగ్మతలు దరిచేరకుండా వుండాలంటే వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. తడి లేకుండా పొడిబట్టతో ఇంటిని శుభ్రపరుస్తూనే వుండాలి.
ఇక కర్పూరంతో ఈగలు, దోమలు ఇంట్లోకి రానీయకుండా చేయొచ్చు. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి ఫ్లోర్‌ను తుడిస్తే క్రిములు నశించడంతో పాటు ఈగలు, దోమలు రావు. వర్షాకాలంలో స్నానం చేసే వేడి నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి స్నానం చేస్తే శరీరంపై ఉన్న క్రిములన్నీ చనిపోతాయి.
ఉదయం బ్రష్ చేసేప్పుడు దానిపై కర్పూరం వేసుకుని దంతాలు శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది. దంతాలకు కీడు చేసే క్రిములు తొలగిపోతాయి. చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెలో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష