బటర్‌మిల్క్‌ ఫ్రెడ్‌ చికెన్

- November 18, 2017 , by Maagulf
బటర్‌మిల్క్‌ ఫ్రెడ్‌ చికెన్

కావలసిన పదార్థాలు: చికెన్‌- ఒక కేజీ (పెద్ద ముక్కలుగా కట్‌ చేయించుకోవాలి), మజ్జిగ- రెండు కప్పులు, మైదా- ఒక కప్పు, సోడా ఉప్పు- అర టీ స్పూను, కారం- ఒక టీ స్పూను, మిరియాల పొడి- అర టీ స్పూను, వెల్లుల్లి ముద్ద- అర టీ స్పూను, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- తగినంత. 
 
తయారీ విధానం: చికెన్‌ను కడిగి మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసి గంటసేపు నానబెట్టాలి. తర్వాత మైదాలో కారం, సోడా ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి ముద్ద, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చికెన్‌ ముక్కలను మరో పదినిమిషాలు నానబెట్టాలి. తర్వాత బాణలిలో నూనెపోసి వేడెక్కాక చికెన్‌ ముక్కలను దోరగా కాల్చుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com