షూటింగ్ కోసం వెళ్ళి... అక్కడ వారి కష్టం చూసి 800 మరుగుదొడ్లు కట్టించిన దర్శకుడు

- November 20, 2017 , by Maagulf
షూటింగ్ కోసం వెళ్ళి... అక్కడ వారి కష్టం చూసి 800 మరుగుదొడ్లు కట్టించిన దర్శకుడు

ప్రధాని మోడీ "స్వచ్ఛ్ భారత్" క్యాంపెయిన్ నేపథ్యంలో అక్షయ్ కుమార్ హీరో గా టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ అనే చిత్రం తెరకెక్కిన సంగతి విధితమే.. కాగా ఇదే నేపథ్యంతో రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం లో "మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్ " అనే చిత్రం రాబోతున్నది. కాగా ఈ సినిమా షూటింగ్ కోసం రాకేశ్ ముంబై లోని మురికివాడలకు వెళ్లారు. ఆ మురికి వాడల్లో నివసిస్తున్న ప్రజల కష్టాలను చూసిన మెహ్రా మనసు చలించింది... వారి బాధలను తీర్చడానికి తన వంతుగా మరుగు దొడ్లు కట్టించడానికి ముందుకు వచ్చారు. మురికి వాడల ప్రజల కోసం తన సొంత డబ్బుతో 800 మరుగు దొడ్లు కట్టించాడు. కానీ ఈ విషయం ఎక్కడా మెహ్రా చెప్పుకోలేదు.. స్థానిక మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. టాయిలెట్స్ సౌఖర్యం లేక నిరుపేదలు పడుతున్న బాధలను చూసి... మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్ ను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం వరల్డ్ టాయిలెట్ డేను పురష్కరించుకొని ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో టాయ్ లెట్ బొమ్మ గీస్తున్న ఓ గోడ పక్కన ఓ తల్లి తన కుమారుడిని ఆప్యాయంగా పట్టుకున్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. ముంబై కి చెందిన నలుగురు పెద విద్యార్ధుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వారిలో ఒకబాలుడు తన తల్లి కోసం టాయ్ లెట్ నిర్మించాలని అనుకుంటాడు. ఈ విషయంలో ప్రధాని సాయం కోరుతూ ఓ లెటర్ ఆయనకి రాస్తాడు. ఈ సినిమాలో మరాఠి నటి, జాతీయ అవార్డు గ్రహీత అంజలి పథక్ ప్రధాన పాత్రలో నటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com