'పద్మావతి' లొల్లి
- November 21, 2017
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రతిష్టాత్మంగా తెరకెక్కించిన 'పద్మావతి' చిత్రంపై రగులుకున్న రాజకీయ రగడ ఇప్పట్లో చల్లారేలా లేదు. సందట్లో సడేమియాగా ఈ వివాదం నుంచి లబ్ది పొందేందుకు రాజకీయ పార్టీలు.. ప్రత్యేకించి బీజేపీ ఉవ్విళ్లూరుతున్నట్టు కనిపిస్తోంది. భోపాల్‌లో మహారాణి పద్మావతికి స్మారకమందిరం నిర్మిస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ ప్రకటించారు. రాణి పద్మావతిని రాష్ట్రమాతగా పేర్కొన్న ఆయన... రాణి పేరుమీదుగా ఓ అవార్డు కూడా ప్రారంభించాలని నిర్ణయించారు. మహిళల అభివృద్ధి కోసం కృషిచేసేవారికి ''రాష్ట్రమాత పద్మావతి పురస్కార్''తో సత్కరిస్తామని ఆయన ప్రకటించారు. రాజ్‌పుత్ వర్గీయుల మనోభావాలను గాయపర్చే సన్నివేశాలను తొలగించకపోతే.. తమ రాష్ట్రంలో పద్మవతి సినిమాను విడుదల కానివ్వబోమని మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. మరుసటిరోజే ఈ అంశంపై ఈ బీజేపీ నేత మరింత దూకుడు ప్రదర్శించడం విశేషం.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







